ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ లో మల్కాపూర్ కు చెందిన బాధితులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు సునీల్, మోహన్, మునావర్ లు మీడియాతో తమ గూడును వెల్లబోసుకున్నారు. స్వాతంత్రం అనంతరం కాందేశికులకు 1950 ప్రాంతంలో భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తమ పూర్వీకులైన రాధాబాయికి మల్కాపూర్ గ్రామంలోని 115, 123, 137, 141, 267 లోగల సుమారు 143 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. సదరు భూమిపై వివాదం తలెత్తగా 1998 నుంచి న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, దేశ ఉన్నత న్యాయస్థానాల సైతం తమకు అనుకూలంగా తీర్పులు వెల్లవరించినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. రాష్ట్ర భూ పరిపాలన శాఖ సైతం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పరిశీలన జరిపి భూమి కేటాయించాలని పలుమార్లు సూచించిన స్థానిక అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.