నోడల్ అధికారి సాంబశివరావు డిపిఆర్ఓ, అరుంధతి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 4:
హైదరాబాదు ఉప్పల్ స్టేడియం నందు జరిగే IPL క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు మరియు ఓటర్లకు అవగాహన కల్పించే క్రమంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా విచ్చేయుచున్న సందర్శకులకు ఓటు పై అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరు ఓటు వేయాలి , నా ఓటు నా దేశం కోసం. ఎన్నికల పర్వం-దేశానికి గర్వం. మరియు ప్రతి ఒక్కరూ ఓటును ఆయుధంగా మలుచుకుని అధిక సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని , అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి సాంబశివరావు డిపిఆర్ఓ, అరుంధతి డిపిఎం , యాదయ్య sveep సిబ్బంది వెంకట్, sravan తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.