వెలిసిన అనధికార ఫ్లెక్సీ.. తొలగించిన ఈ.సి

 

జగిత్యాల, అక్టోబర్ 19: ఎన్నికల వేల టి.ఎన్ శేషన్ చూపిన ఎన్నికల నిబంధనలు నేడు జగిత్యాల లో ఆచరణలో కనిపిస్తున్నాయి. సీఎం కూతురైన సీనియర్ నాయకుడైన అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారన్నది నిత్యసత్యమైంది. జగిత్యాల పట్టణంలోని ధర్మపురి రోడ్డులో ఓ కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ పార్టీ కి చెందిన పెద్ద ఫ్లెక్సీని గత మూడు రోజుల క్రితం ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటైన ఈ ఫ్లెక్సీ విషయం స్థానికుల ద్వారా మునిసిపల్ అధికారులకు చేరినట్లు తెలిసింది. బుధవారం తొలగించేందుకు మునిసిపల్ అధికారులు ఫ్లెక్సీ ఉన్న చోటకు చేరి తొలగింపు ఏర్పాట్లు జరుగగా ఓ ప్రభుత్వ అధికారి ఫోన్ కాల్ తో నిలిచిపోయినట్లు సమాచారం. గురువారం నాటికి ప్రభుత్వ అనుమతి వస్తుందని అందరూ అనుకున్నారు. తీరా ఎలాంటి అనుమతులు రాని నేపథ్యంలో సాయంత్రం ఎన్నికల అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ముందు ఎవరైనా ఒక్కటేనని ముఖ్యమంత్రి కూతురు ఫ్లెక్సీలనే నిర్దాక్షిణ్యంగా తొలగించిన ఎన్నికల అధికారులకు ఇది మామూలు ముచ్చెటేనంటూ స్థానికంగానే చర్చించుకోవడం కనిపించింది..

Leave A Reply

Your email address will not be published.

Breaking