సర్పంచ్:- వెంకట్ రాంరెడ్డి
నాయకులు
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వెంకట్ రత్న పూర్ గ్రామంలో గురువారం రోజున కంటి వెలుగు కార్యక్రమాన్ని పంచాయితీ భవనంలో ఏర్పాటు చేయగ బిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా నాయకులు సత్యనారాయణ గౌడ్ ,
సర్పంచ్ వెంకట్ రాంరెడ్డితో , డి ఎల్ పి ఓ శ్రీనివాస్ తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా మండల జడ్పీటిసి రాణి సత్యనారాయణ గౌడ్ , సర్పంచు వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు తోనే కంటి వెలుగు ప్రారంబించిన్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు, ప్రపంచంలోనే సామూహిక కంటి వెలుగు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూపించుకోవాలని అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందనీ , ఈ కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని గురువారం రోజున సర్పంచ్ వెంకట్ రాంరెడ్డి ,
, ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని గడప గడపకి తెలియజేసి ప్రతి ఒక్కరూ చూపించుకోవాలని పిలుపునిచ్చారు. కంటివెలుగు మొదటి విడతలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళికతో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకట్ రత్న పూర్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు, వైద్య అధికారులు , ఆనంద్, అపర్ణ, డాక్టరు లు , వైద్య సిబ్బంది , ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ,బొల్లంపలి బబుల్ రెడ్డి సర్పంచ్ భగవాన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ తూప్రాన్ మండల అధ్యక్షులు బొల్లంపల్లి బబుల్ రెడ్డి, నాయకులు గడ్డి వెంకటేష్ యాదవ్, ఎంపీ ఓ రమేష్ , పంచాయతీ కార్యదర్శి , పాలక వర్గం సభ్యులు గ్రామ ప్రజలు, అదికారులు, ఆశ వర్కర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.