ఎల్.ఎఫ్.ఎల్ పోస్టులు మంజూరు చేయాలి
ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్
జగిత్యాల, ఫిబ్రవరి 9: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పదోన్నతుల షెడ్యూల్లోనే పండితులకు, పి.ఈ.టి.లకు పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ పనులకై నిర్మల్ జిల్లాకు వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్ జగిత్యాల లో ఎస్టీయూ నాయకులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సదానంద గౌడ్ మాట్లాడుతూ దీర్ఘకాలముగా పండిత, పీఈటి పోస్టులను అప్ గ్రేడ్ చేయాలని కోరారు. గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీదుగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని కానీ నేటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. ప్రాథమిక పాఠశాలల హెచ్.ఎం. (ఎల్.ఎఫ్.ఎల్) పోస్టులు మంజూరు చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఎస్జిటి గా పనిచేస్తున్న టీచర్ డీఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైతే ఎస్జిటి సర్వీస్ కు ఎంటైటిల్ పాయింట్లు ఇవ్వాలని కోరారు. సీనియారిటీ జాబితా తయారీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా మాన్యువల్ పద్ధతిలోనే పదోన్నతులు పూర్తిచేయాలని సదానంద గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో STU జగిత్యాల జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్, కోరుట్ల మండల శాఖ అధ్యక్షులు పాలెపు శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నల్ల సాయికుమార్, కథలాపూర్ మండల శాఖ అధ్యక్షులు నల్ల రాజకిరణ్, ప్రధాన కార్యదర్శి అడెపు రాజశేఖర్ , తదితరులు పాల్గొన్నారు