ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం వాగేశ్వరి కళాశాల వీడ్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అప్పని లక్ష్మణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…కళాశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణ,దేశభక్తి భావాలతో మెలుగుతూ ఉన్నతమైన స్థానాలకు చేరుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.ఇదే వాగేశ్వరి కళాశాలలో చదువుకున్న ఎంతోమంది వ్విద్యార్థులు నేడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. వీడ్కోలు వేడుకలో విద్యార్థులు రూపొందించిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ శ్రీధర్ రెడ్డి,శ్రీనివాస్,సాగర్,నరేష్,రమణ, వంశీ,విద్యార్థులు ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.