ప్రధానమంత్రికి హకీంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 8:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని హకీంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వెళ్ళి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శనివారం మధ్యాహ్నం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్, రిటైర్డ్ సి.ఎస్. ఐ.వై.ఆర్. కృష్ణారావు రిటైర్డ్ డీజీపీ అరవిందరావు, రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాస్ తదితరులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్ళారు. ప్రధాన మంత్రి పర్యటన హకీంపేట విమానాశ్రాయానికి వచ్చి వెళ్ళడానికి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు, ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమం విజయవంతం కావడంతో సంబంధిత శాఖల అధికారులను అభినందించారు.