జగిత్యాల ప్రతినిధి, జులై 9( ప్రజా బలం) మలిదశ ఉద్యమ కళాకారుడు, గాయకుడు వేద సాయిచంద్ ఇటీవల మరణించగా ఆదివారం హైదరాబాద్ లోని జి.ఎస్.ఆర్ కన్వెన్షన్ లో దశదిన కర్మ నిర్వహించగా తెలంగాణ మాల మహానాడు జగిత్యాల జిల్లా నాయకులు హాజరై అమరుడైన సాయి చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి తండ్రిని కలిసి ఓదార్చారు.
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి తన పాటలతో, తన గళంతో నింపిన వ్యక్తి పిన్న వయసులోనే కాలం చేయడం తెలంగాణ ప్రజలను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్, జిల్లా యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు తోట జగన్, జిల్లా కార్యదర్శి నక్క సురేష్, సారంగాపూర్ మండలం అధ్యక్షులు కొర్రి రాజు పాల్గొన్నారు.