ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
అలియాబాదు గ్రామంలోని మార్కెట్ కమిటీలో గల రైతు వేదిక నుండి కలెక్టర్ గౌతమ్, జిల్లా వ్యవసాయ , మండల వ్యవసాయ అధికారులు
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 18:
గురువారం రైతు రుణమాఫీ-2024 నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల తో సంబురాలు జరుపుకుంటూ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో శామీర్ పేట మండలం, అలియాబాదు గ్రామంలోని మార్కెట్ కమిటీలో గల రైతు వేదిక నుండి కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు .అనంతరం కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆలియాబాదు రైతులందరికీ నమస్కారములు, రైతు రుణమాఫీ అనేది రైతులకు పండగ లాంటిదని ,రైతులకు రుణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గొప్పనిర్ణయం తీసుకుందని అన్నారు. మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ రైతు ఖాతాలో జమ అవుతుందని అన్నారు. మీ రుణం జీరో అవుతుందనీ అన్నారు. రైతులు రుణమాఫీ కాలేదని అధైర్య పడవద్దు అని రెండో విడత, మూడో విడత లో రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. వర్షాలు కురుస్తున్నందున వ్యవసాయం చేసే రైతులు రుణాల కోసం రెన్యువల్ చేసుకోవాలన్నారు. రైతులకు ఏమన్నా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి జిల్లా వ్యవసాయ , మండల వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో
షామీర్పేట్ మండల ప్రత్యేక అధికారి సైదులు, జిల్లా వ్యవసాయ అధికారి రేఖ మేరీ,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.