ముదిగొండ లో రైతు రుణమాఫీ సంబరాలు

 

మాజీ జడ్పీటీసీ బుల్లెట్ బాబు ఇంటి నుండి ప్రధాన కూడలి వద్దకు రైతులు కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ

ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మల్లు నందిని విక్రమార్క

ఖమ్మం ప్రతినిధి జులై 31 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సతీమణి అమ్మా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా ముదిగొండ మండలం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ముదిగొండ ప్రధాన కూడలి వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ముందుగా మాజీ జడ్పీటీసీ బుల్లెట్ బాబు నివాసం వద్ద భారీగా చేరుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నందిని విక్రమార్క గారికి ఘన స్వాగతం పలికారు అనంతరం బుల్లెట్ బాబు నివాసం వద్ద నుండి ముదిగొండ ప్రధాన కూడలి వద్దకు డప్పులు, నాట్యాలతో పాటల హోరుతో భారీ ర్యాలీ గా వెళ్లారు అనంతరం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలకు పండుగ అని,ఇది రైతు రుణ మాఫీ కేవలం ట్రైలర్ మాత్రమే అని అభివృద్ధి,సంక్షేమం ఉరుకులు పెడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యకులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు,మాజీ జడ్పీటీసీ బుల్లెట్ బాబు,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్,వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఐనాల నరసింహ రావు,మట్టా రవీందర్ రెడ్డి ఉసికేల రమేష్ బ్లాక్ అధ్యక్షుడు కందిమళ్ల వీరబాబు మల్లెల అజయ్ మహ్మద్ అజ్గర్,పల్లిపాటి కృష్ణ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దిబ్బల సౌజన్య, గూడిపూడి బుచ్చిరామయ్యా,వల్లూరి బద్రారెడ్డి,చెరుకుపల్లి రాంబాబు,చిమ్మసర్తి ఎల్లయ్య బిక్షాల భిక్షం భూక్యా ధర్మా,మాజీ ఎంపీపీ కొత్తపల్లి నాగలక్ష్మి,పద్మా, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking