- తుంబూరు దయాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
- -ఆగస్టు 20లోపు ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని తీర్మానం
ఖమ్మం ప్రతినిధి జులై 31 (ప్రజాబలం) ఖమ్మం కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు, పోటీల నిర్వహణ పై ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశము బుధవారం నిర్వహించింది. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు ఆగస్టు నెల 20వ తేదీ లోపు నిర్వహించాలని తీర్మానించారు. అదేవిధంగా త్వరలోనే మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి కబడ్డీ పోటీల నిర్వహించాలని అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే నిర్వహణ ఏర్పాట్ల పై దృష్టి సారించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు కూడా ఖమ్మం వేదికగా నిర్వహించాలని తీర్మానించారు. అసోసియేషన్ బలోపేతం అవ్వడం ద్వారా కబడ్డీ క్రీడను మరింత వెలుగులోకి తీసుకుని రావొచ్చని సభ్యులు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల కృష్ణ ఫర్ బాబు, సామినేని హరిప్రసాద్ , మోతారపు సుధాకర్ , పిచ్చయ్య , మేకల మల్లిబాబు, నాగార్జున రెడ్డి , అయితం రాజు డాక్టర్ సుధాకర్ , ప్రసాద్ రావు, వెల్లంకి స్వామి, మోదుగు మోహన్ రావు, సిహెచ్. సుధాకర్ , వి. సత్యనారాయణ , కె. లాలయ్య మల్లేష్ , చిలకా రాములు తదితరులు పాల్గొన్నారు