వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులను ఆదేశించారు
…..జిల్లా కలెక్టర్ క్రాంతి వలూరి
సంగారెడ్డి ఆగష్టు 01 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా లోని కోహీర్ మండలంలోని కొత్తూరు (డి) గ్రామంలో గోద్రెజ్ అగ్రోవేట్ సంస్థ ఏర్పాటుచేసిన నర్సరీ లో ప్లాంటేషన్ కు సిద్ధంగా వున్నా ఆయిల్ ఫామ్ మొక్కలను కలెక్టర్ పరిశీలించారు . రాష్ట్ర వనమహోత్సవంలో భాగంగా కొత్తూరు (డి ) గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ వంటలు ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఫామ్ 2024 – 25 సంవత్సరములకు గాను జిల్లాకు 3000 ఎకరాల లక్ష్యంగా నిర్ణయించబడిందని తెలిపారు . తొమ్మిది వందల ఎకరాలకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందని , ఇప్పటివరకు 700 ఎకరాలలో అయిల్ ఫాం ప్లాంటేషన్ జరిగిందని కలెక్టర్ తెలిపారు .గోద్రెజ్ అగ్రోవేట్ సంస్థ నుండి జిల్లా రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా కు సరిపడినన్ని నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు . ఆయిల్ ఫాం సాగు తో రైతులకు స్వయం సంవృద్దికి తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులను ఆదేశించారు . వ్యవసాయ శాఖ అధికారి ఉద్యాన వన శాఖ అధికారులతో సమన్వయము చేసుకొని లక్ష్యాలను సాధించాలని అన్నారు .
ఉద్యాన వన శాఖ చేపట్టిన సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా వివిధ పండ్ల తోటల విస్తీర్ణం పెంచుట కొరకు సుమారు 340 ఎకరాలు సాగు కొరకు లక్ష్యంగా నిర్ణయించబడింది తెలిపారు. నేటికీ సుమారు 100 ఎకరాల్లో అమలు పరచడం జరిగింది. మిగతావి పురోగతిలో ఉన్నాయన్నారు. ఇది రైతు సంక్షేమ పథకాలలో ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవనకాధికారి సోమేశ్వరరావు, జహీరాబాద్ ఆర్డీవో రాజు, కోహీర్ తాసిల్దార్ బాల శంకర్, మండల వ్యవసాయ అధికారి నవీన్
గోద్రెజ్ ఆగ్రోటెక్ జిల్లా ఆమోదిత కంపెనీ ప్రతినిధులు స్వీటీ, పవన్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .