– నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగట్లే!
– తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 1
రోడ్డు నిర్మాణ పనులు నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి -విలాసాగర్ -తనుగుల దారి కోసం గతంలో ఉన్న రోడ్డును తొలగించి కంకర తేలేలా చేశారు. రోడ్డుకు ఇరువైపులా కుప్పలుగా డాంబర్ పోసి.. అలానే వదిలేశారు. ఈ దారి గుండా వెళ్తున్న ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. దాదాపు 6 నెలలుగా ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నట్టు తెలుస్తున్నది. కోరపల్లి గ్రామ అంబేడ్కర్ చౌరస్తా నుంచి విలాసాగర్ మీదుగా తనుగుల వరకు సుమారు 7 కిలోమీటర్ల వరకు డాంబర్ తేలి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. కంకర తేలిన రోడ్డు గుండా వెళ్తున్న క్రమంలో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాహనాలు సైతం డ్యామేజీ అవుతున్నాయని, కంకర తేలి..రోడ్డు వల్ల వాహనాల టైర్లు డ్యామేజ్ అవుతున్నాయని కొందరు వాహనదారులు చెప్తున్నారు.