అర్థగణాంక శాఖ-హైదరాబాద్ సంయుక్త సంచాలకులు పి.రవీందర్ రెడ్డి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 : వరి పంట దిగుబడిని అంచనా వేసుకుని తదుపరి పంట సాగుకు తగిన జాగ్రత్తలు తీసుకొని అధిక దిగుబడికి రైతులు కృషి చేయాలని అర్థంగణాంక శాఖ- హైదరాబాద్ సంయుక్త సంచాలకులు పి.రవీందర్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా లోని హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో బెంబడి గురువయ్య సాగు చేసిన వరి పంటను ముఖ్య ప్రణాళిక అధికారి జి సత్యం,జిల్లా వ్యవసాయ అధికారి జి కల్పన,ఉప గణాంక అధికారి డి శ్రీకాంత్ లతో కలిసి సందర్శించి పంట దిగుబడిని అంచనా వేశారు.ఈ సందర్భంగా అర్ధగణాంక శాఖ-హైదరాబాద్ సంయుక్త సంచాలకులు మాట్లాడుతూ…ఈ సంవత్సరం పంట దిగుబడి అంచనా ప్రకారం తదుపరి పంట సాగుకు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పంట పొలంలో 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో పంట కోత ప్రయోగం జరిపి 19.855 కిలోల దిగుబడి తీయడం జరిగిందని తెలిపారు. రైతులు పంట సాగులో మెళకువలు పాటించి అధిక దిగుబడి సాధించేలా కృషి చేయాలని, వివరాలు,సలహాల కొరకు వ్యవసాయ,విస్తీర్ణ అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం రజిత,ఉప గణాంక అధికారి ఎస్.పాపయ్య,మండల ప్రణాళిక,గణాంక అధికారి పి రమేష్,వ్యవసాయ విస్తీరణ అధికారి ఎస్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.