ఆర్జిపీఆర్ఎస్ బలోపేతానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది – నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 15 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఆర్జిపిఆర్ఎస్పై అవగాహన
అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ స్థాపించిన ఆర్ జి పి ఆర్ ఎస్ బలోపేతానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఆర్జీపిఆర్ఎస్ జోనల్ కన్వీనర్ మహమ్మద్ జావేద్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల ప్రజాప్రతినిధులకు ఆర్ జిపిఆర్ఎస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జిపిఆర్ఎస్ రాష్ట్ర ఇంచార్జి కిరణ్ మూగభాస్, రాష్ట్ర కన్వీనర్ రాచమల్ల సిద్దేశ్వర, పిసిసి సెక్రటరీ కశపాక రాజేష్ లతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ అనేది అట్టడుగు స్థాయి ప్రజలకు వారి రాజకీయ అవకాశాలను విస్తరించడం తో పాటు పంచాయతీరాజ్ సంస్థలను స్థానిక సంస్థలలో భాగస్వామ్యం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రకటించిన అధికారులను అమలపరుస్తూ ఆర్ జి పి ఆర్ ఎస్ ను బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్ జీ పి ఆర్ ఎస్ తో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, అర్బన్ లోకల్ బాడి ప్రతినిధులలో అధికార వికేంద్రీకరణ, అక్షరాస్యత పెంపొందించడం, స్థానిక స్వీయ ప్రభుత్వాల పాత్ర మరియు అధికారం గురించి పౌరులలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

Congress is committed to strengthening RGPRS - City Congress President Mohammad Javed

దేశంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే తెలంగాణలో ఏ విధంగానైతే ఆరుగారెంటీలను అమలుపరుస్తుందో, దేశంలో కూడా ఐదు న్యాయాలను అమలుపరుస్తుందని తెలిపారు. యువ న్యాయం, మహిళా న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సమన్యాయం వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, ఫాతిమా జోహరా,ఖమ్మం జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పొరేటర్ కమర్తపు మురళి గజ్జెల లక్ష్మి, రాఫిధ ముస్తఫా, రావూరి కరుణ, వడ్డే నారాయణ, తది తరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking