పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల ఫాసిస్ట్ హంతక దాడి దుర్మార్గమైన చర్య ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమ్మద్ జావిద్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 22 (ప్రజాబలం) ఖమ్మం ఈనెల ఫిబ్రవరి 20 నసాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసులు ఫాసిస్టు హంతక స్వభావంతో అత్యంత కర్కశంగా జరిపిన కాల్పులలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బటిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు శుభకరన్ సింగ్ మరణించాడు ఈ నరహంతక దాడిని నగర కాంగ్రెస్స్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. బరితెగించి కాల్పులకు తెగబడిన సంబంధిత హర్యానా పోలీసులను వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ కాల్పుల సంఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుల పండించిన పంటకు ఎం ఎస్ పి అంటే రైతులు పండించిన పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రేట్లు చెల్లించాలని రుణ విమోచన చట్టం తీసుకురావాలని విద్యుత్ సవరణ బిల్లు ద్వారా విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కౌలు రైతులకు తగిన రక్షణ కల్పించాలని మూడు వ్యవసాయ సాగు చట్టాలను బేసిక్ గా ఉపసంహరించుకోవాలని ఢిల్లీ కేంద్రంగా సాగిన చారిత్రాత్మకమైన రైతంగ పోరాటం మరణించిన 750 మంది రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై అమానుషంగా కాల్పులు చేయడం నరేంద్ర మోడీ నాయకత్వంలోనీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలకు నిదర్శనమని అభిప్రాయ పడుతుంది ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతాంగ పోరాటం సందర్భంగా మూడు నల్ల సాగు చట్టాలు ఉపసంహరణకు రైతుల పంటలకు ఎం ఎస్ పి ఇస్తామన్న నరేంద్ర మోడీ రాతపూర్వక హామీని అమలు చెయ్యని కారణంగా తిరిగి ఉద్యమ బాట పట్టిన రైతుల న్యాయమేనా ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించి నిర్బంధం ద్వారా అణిచివేత ద్వారా ఉద్యమాన్ని ఆపాలనుకోవడం ఫాసిస్ట్ ఆలోచన తప్ప వేరు కాదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు జరిపిన కాల్పులు దుర్మార్గమైన చర్యని మహమ్మద్ జావిద్ అన్నారు