ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఇరువర్గాల ప్రజలు పండగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ అన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర మార్గాన్ని (రూటామ్యాప్) పరిశీలించారు. శ్రీరామనవమి,రంజాన్ పండుగలను మతసామరస్యంతో స్నేహపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లను మరియు వివిధ పోస్టులను నమ్మి ఆవేశాలకులోనై శాంతి భద్రతలకు భంగం కలగ చేయవద్దని సూచించారు. గుంతలను పూడ్చివేసి రహదారిపై ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.డిఎస్పీ జీవన్ రెడ్డి,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సిఐ మల్లేష్ ఉన్నారు.