ఖమ్మం ప్రతినిధి మార్చి 29 (ప్రజాబలం) ఖమ్మం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించిన రీతిలో మనం కూడా శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు.
ప్రతి గ్రామంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని వేడుకను వైభవోపేతంగా జరుపుకోవాలని ప్రజలందరు ఆనందోత్సాహాల మధ్య సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.