ఖమ్మం కార్పొరేషన్ 24వ డివిజన్లో సీమంత వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 29 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ స్థానిక 24వ డివిజన్లో 25 మంది గర్భిణీ స్త్రీలకు అంగన్వాడి స్కూల్ నందు 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి మరియు వారి సతీమణి కమర్తపు సరిత ఆధ్వర్యంలో సీమంత వేడుకల్ని ఘనంగా నిర్వహించారు . కమర్తపు సరిత మాట్లాడుతూ పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు మానసికంగా , శారీరకంగా దృఢంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు . సిడిపిఓ కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలందరూ కూడా తెల్ల అన్నం తినకుండా మిల్లెట్స్ నీ ఆహారంగా తీసుకోవాలని ఏదైతే అంగన్వాడి స్కూల్లో సూచించిన విధంగా ఆహారం తీసుకోవాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో 25 మంది గర్భిణీ స్త్రీలకు కార్పొరేటర్ కమర్తము మురళి వారి సతీమణి కమర్తపు సరిత పూలు , పండ్లు , గాజులు , చీరలు పెట్టి ఘనంగా సీమంత వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ పుష్పలత అంగన్వాడీ టీచర్స్ లు విజయ సృజన పిహెచ్సి సిబ్బంది సత్యనారాయణ లలిత 24వ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ రెహమాన్ , గోలి రామారావు శ్రీ గాద శ్రీను శేషగిరి మనోహర్ అస్లాం కోటి యాకూబ్ మరియు వన్ టన్ సెక్టార్ లోని 30 మంది అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking