ఫీడిండియా పేరుతో సమాజ సేవలు అనిర్వచనీయం
టి.యస్.ఆర్టీసి.ఎస్.ఎంమ్ రఘుబాబు
ఖమ్మం ప్రతినిధి మార్చి 29 (ప్రజాబలం) ఖమ్మం పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేoద్రం ద్వారా ఉచితంగా చల్లటి గ్లాసు మంచినీరు అందించేందుకు సామాజిక సేవకురాలు మిస్సెస్ ఇండియా, మిసెస్ యూనివర్స్, ఫీడిoడియా ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ మహమ్మద్ ఫర్హా శ్రీకారం చుట్టారు…
ఖమ్మం నగరంలోని
పాత బస్టాండ్ వద్ద ఫీడిoడియా ఫౌండేషన్ అద్యక్షురాలు డాక్టర్ ఫర్హ మహమ్మద్ సౌజన్యంతో
చలివేంద్రం ప్రారంభమైంది.
ఈ చలివేంద్రాన్ని ఈ నెల 29 నుంచి వేసవికాలం ముగిసేంతవరకు నిర్విరామంగా కొనసాగిస్తామని ఫీడిoడియా ఫౌండేషన్ ప్రతినిధులు కన్నోజు కిరణ్ కుమార్,సబిత, ప్రియలు తెలిపారు. ప్రతిరోజు 24గంటల పాటు ఈ రెండు నెలలు స్వచ్ఛమైన పరిశుభ్రమైన మినరల్ వాటర్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఖమ్మం బస్టాండ్ ఎస్.ఎమ్. రఘుబాబు మాట్లాడుతూ.. ఈకార్యక్రమానికి సహకరిస్తున్న డాక్టర్ ఫర్హా సేవలను ఆయన అభినందించారు. ఈకార్యక్రమంలో తోడ్పాటునందిస్తున్న హ్యూమన్ రైట్స్ అద్యక్షురాలు అన్నపూర్ణ, రిటైర్డ్ ఎమ్మార్వో రమేష్, బస్సు రైలు ప్రయాణికుల సంఘం ఉపాద్యక్షులు రచ్చ రామారావు టీవీ రాజు ఎస్డి పాషా హనుమంతరావు తాసిల్దార్ జానకిరాములు తదితరులు పాల్గొన్నారు .