ప్రజాబలం జన్నారం మండల రిపోర్టర్ 16 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటీగూడ గ్రామనికి చెందిన సేపూరి భూమరెడ్డి కొద్ది రోజుల క్రితం మృతిచెందిన బాధిత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు విషయం తెలుసుకున్న రోటీగూడ సమాజిక సంక్షేమ కమిటీ సభ్యులు 20 వేల రూపాయలు అలాగే అందమైన పల్లెటూరు గ్రూప్ తరపున 54 వేల రూపాయలు తపలాపూర్ గ్రామీణ బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేసి బాండు ను భూమరెడ్డి కి కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు ఆద్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ మేరకు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపినారు.