ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం పచ్చదనం పై ప్రతిఒక్కరు అవగాహన పెంపొందిచుకోవాలి ఖమ్మం మేయర్ శ్రీమతి నీరజ మొక్కలు పెంచడం ఒక సామాజిక బాధ్యతగా అలవర్చుకున్న శ్రీచైతన్య విద్యార్థులు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ స్థానిక రుద్రమ్మకోట రోడ్డు నందు గల ఆరు ఎకరాల సువిశాల శ్రీచైతన్య గ్లోబల్ విస్తా స్కూల్ లో బుధవారం వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖమ్మం మేయర్ శ్రీమతి పొన్నుకొల్లు నీరజ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ కాలుష్య కారణంగా అనేక మంది తీవ్ర ఆనారోగ్యనికి గురిఅవుతున్నారని, అలా కాకుండా మొక్కలు పెంచడం దానికి ప్రత్యామ్నాయం అని ప్రతి ఒక్కరు పచ్చదనంపై అవగాహన పెంపొందించు కోవాలి అని విద్యార్థులకు సూచించారు చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం అనేది ఒక సామాజిక బాధ్యత అని ఈ కార్యక్రమం అనేది మా విద్యా ప్రణాళికలో ఒక భాగమని వివరించారు. విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య మాట్లాడుతూ తమ విద్యాసంస్థలు విద్యతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాయని తెలిపారు కార్యక్రమంలో పాఠశాలల డి.జి.యం. చేతన్ మాధుర్ ప్రిన్సిపాల్స్ జయసుధ, టిఎన్ఎన్. శర్మ, కొఆర్డినేటర్ లక్ష్మీ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.