రావినూతల చర్చి నిర్మాణానికి మంత్రి పొంగులేటి రూ.20వేల విరాళం

 

మధిర ప్రతినిధి అక్టోబర్ 16 (ప్రజాబలం) బోనకల్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రావినూతల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చర్చికి రూ. 20వేలను బుధవారం ఉదయం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విరాళంగా అందించారు. భవిష్యత్తులోనూ చర్చి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విరాళం అందుకున్న చర్చి నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉమ్మినేని కృష్ణ, భాగం నాగేశ్వరరావు, చర్చి నిర్వాహకులు ఏసుపోగు ప్రభాకర్, తాళ్లూరి రత్నం, తాళ్లూరి ఏసు, తుడుం ప్రసాద్, తాళ్లూరి సామియేలు, కాంపాటి జాన్, తాళ్లూరి వెంకటి తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking