బీ.సి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం జూన్ 9న ప్రారంభం

 

జూన్ 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ

జూన్ 14న నిర్వహించే వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఎర్పాట్లు చేయాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 7:
బీసి కులవృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్బంగా లాంచనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
బుధవారం సంగారెడ్డి నుండి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో సమావేశంలో పాల్గొనగా, హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో సమావేశం నిర్వహించి బి.సి. కుల, చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించగా, సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం నుండి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం… అధికారులతో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,మాట్లాడుతూ, బీసీ కుల, చేతి వృత్తుల వారు ఆన్ లైన్ లో సాయంత్రం వరకు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్దిదారుల ఎంపిక చేయాలని అన్నారు. జూన్ 9న సీఎం కేసీఆర్ లాంచనంగా ప్రారంభిస్తారని, జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన తరువాత విచారణ చేపట్టి ప్రతి నెలా దశల వారిగా లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్బంగా రెండవ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తులు ఆర్థిక సహాయం, అవకాశం ఉన్న చోట కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టాలని సూచించారు. జూన్ 14న నిర్వహించే వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పండుగ వాతావరణంలో వైభవోపేతంగా వైద్య శాఖ దినోత్సవం నిర్వహించాలని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులను వేడుకలకు ఆహ్వానించాలని, ఆరోగ్యశ్రీ సేవలు, డయాలసిస్, కంటి వెలుగు, కేసిఆర్ కిట్ లబ్దిదారులు పాల్గోనేలా చూడాలని అన్నారు. వైద్యశాఖలో మంచి పనితీరు కనబరిచిన అధికారులకు, ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు అవార్డులు అందించాలని అన్నారు. వైద్య శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగులకు చీరలు పంపిణీ చేయాలని, ఏఎన్ఎం లకు బీపి యంత్రాలు అందించాలని అన్నారు. 24 జిల్లాలలో కెసిఆర్ న్యూట్రిషన్ పథకాలు ప్రారంభించాలని తెలిపారు.
ఈ వీడియో సమావేశంలోసంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking