సదాశివపేట ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించండి మంత్రి హరీష్ రావు కు వినతి..

 

…బిఆర్ఎస్ నాయకురాలు నిర్మల ప్రేమనందం.

సంగారెడ్డి జున్ 07 ప్రజ బలం ప్రతినిది:
సంగారెడ్డి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్, పదవికి, (కొండాపూర్ మండల్ చర్ల గోపులారం గ్రామానికి చెందిన డి.నిర్మల ప్రేమనందం), తనను నియమించాలని, రాష్ట్ర ఆర్థిక & వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై 2016 లో టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నాను. కావున నాకు అవకాశం కల్పించి ఏఎంసీ చైర్మన్గా నియమించాలని, మంత్రి గారికి మరియు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు విన్నవించడం జరిగిందన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న సీటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు (రిజర్వ్) కేటాయించడం జరిగింది. కావున నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళను, కాబట్టి నాకు ఏఎంసీ చైర్మన్గా నియమించగలరని కోరానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking