రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తికి ఆర్థిక సహాయం

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 11 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన బోడకుంటి చిన్న రాయమల్లు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో ఫోన్ పే,గూగుల్ పే ద్వారా జమచేసిన 1,28,000/-(ఒక లక్ష ఇరవైఏనిమిది వేలు) రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన తాజా మాజీ ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి ఈ కార్యక్రమంలో పెరిక సంఘం అధ్యక్షుడు బోడకుంట కిషన్, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి అడ్డగూరి వెంకటేష్ నాయకులు ఇండ్ల నగేష్,లక్కాకుల రాజశేఖర్,ఎర్రం మల్లేష్,ముత్తె కుమార్,గోల్ల శ్రీకాంత్,అర్శం రమేష్,గోల్ల తిరుపతి, మొండి పాల్గొన్నారు మీరు చేసిన ఆర్థిక సహాయం రాయమల్లు ప్రాణం నిలబెడుతుంది అని ఆశిస్తూ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking