ఖమ్మం ఎంపి కాంటెస్ట్ అభ్యర్థి ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకులు
షేక్ మహ్మద్ రసూల్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 12 (ప్రజాబలం) ఖమ్మం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పాలకుల సవితి తల్లి ప్రేమతో దక్షిణ భారతదేశాన్ని దోచి ఉత్తర భారత దేశాన్ని పోషిస్తున్నారని ఖమ్మం ఎంపి కాంటెస్ట్ అభ్యర్థి ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకులు షేక్ మహ్మద్ రసూల్ ఆరోపించారు. భారతదేశంలో ఒక రాష్ట్రల నుండి పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుండి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే అదే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి49.8 రూపాయలు తిరిగి ఇస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ 100 రూపాయలు ఇస్తే వెనక్కి 46 రూపాయలు ఇస్తుంది అలాగే ఉత్తర ప్రదేశ్ వంద రూపాయలు ఇస్తే వెనక్కి తిరిగిచ్చే రూపాయలు 333.2 రూపాయలు మధ్యప్రదేశ్ వంద రూపాయలు ఇస్తే 279.1 వెనక్కి తిరిగిస్తుంది. అలాగే బీహార్ రాష్ట్రం వంద రూపాయలు ఇస్తే 922.5 వెనక్కి తిరిగి ఇస్తుంది. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కు తమ వాటాలుగా తెలంగాణ కు 3.637 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు 7.002 కోట్లు తమిళనాడు కు 7.057 కోట్లు కర్ణాటక కు 6.310 కోట్లు కేరళ కు 3.330 కోట్లు 5 రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 27.336 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది. ఒక్క ఉత్తరప్రదేశ్ కు 31.039 కోట్లు బీహార్ కు 17.403 కోట్లు మధ్యప్రదేశ్ కు 13.582 కోట్లు ఈ మూడు రాష్ట్రాలకు కలిపి 62. 024 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వాళ్లు ఓటు బ్యాంకును మలుచుకోవడం కోసం కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు