ఆర్థిక సహాయం బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లిప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 14 : మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ హనుమాన్ నగర్ కు చెందిన కంచాల నర్సయ్య ఇంట్లో నిన్న ప్రమాదవశాత్తు గ్యస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు చెలరేగి ఇంటి పై రేకులు పగిలి ఇంట్లో సామాగ్రి మంటల్లో కాలిపోవడంతో గురువారం రోజున మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి వారి ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకొని ఇంటి పై కప్పు రేకుల కోసం 7000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది,ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ…ఈ సహాయం చేసిన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి ప్రత్యేక ధన్యవాదాలు,తెలుపుతూ వారి రుణ పడి ఉంటా అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.