పెంటలో పోయే చేపల వ్యర్ధాన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసి మత్స్య సహకార సంఘాలకు ఆర్థికంగా బలోపేతం

తెలంగాణ ఫీషరీ సోసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టలు రవీందర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26 : పెంటలో పోయే చేపల వ్యర్ధాన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసి మత్స్య సహకార సంఘాలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ప్రయోగాన్ని చేసామని తెలంగాణా ఫిషరీ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టల రవీందర్ శనివారం అన్నారు.మహానగరం మంచిర్యాల పరిధిలోని ఇందారం గ్రామంలో గల మహిళా మత్స్య సహకార సంఘం ద్వారా ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో చేపల వ్యర్థ్యాలతో సేంద్రియ ఎరువుల తయారీ పై ప్రయోగాన్ని చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి అతిధిగా పిట్టల రవీందర్ పాల్గొని వారు మాట్లాడుతూ…దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఈ సాహసాన్ని మంచిర్యాల జిల్లా లోని మత్స్య సహాకార సంఘాలు చేసాయి అని అన్నారు,చేపల వ్యర్థాలు అంటేనే పనికి రాని దుర్వాసన కలిగినవి అని అభిప్రాయం ఉంటుందని, అలాంటి దూర్వాసన కలిగిన వ్యర్దాలను పంట పొలాలకు ఉపయోగించే సేంద్రియ ఎరువులుగా మార్చుకోవచ్చు అని ఆయన తెలిపారు, ఇందారం గ్రామం మహిళా మత్స్య సహాకార సంఘం మొక్కవోని దీక్షతో 40 రోజుల పాటు చేపల వ్యర్ధాలతో చేసిన ప్రయోగంలో వీరి పాత్ర గొప్పదని కొనియాడారు. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్ తరాల మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ సంస్థ కో-ఆర్డినేటర్ తాళ్లపల్లి కిరణ్,బోయిని శివకుమార్, ఇందారం మహిళా మత్స్య సహకార సంఘం అధ్యక్షురాలు తోగరి లలిత,సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking