ఈతల పోటీలలో మెడల్స్ సాధించిన మొహమ్మద్ యూనస్కు సన్మానం.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 26 అక్టోబరు 2024
మణికొండ వేంకటేశ్వర కాలనీ పార్క్లో స్థానిక కౌన్సిలర్ బిట్లు పద్మారావు, ది సిటీజెన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కార్యదర్శి సయ్యద్ ఆరిప్ మొహమ్మద్, ఉప కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, కమిటీ సభ్యులు రాంసుబ్బా రెడ్డి, శ్రీధర్ లు స్థానిక ప్రజా సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ, నివారణ చర్యలపై అవలంభించల్సిన విధి విధానాల గురించి మీటింగ్ నిర్వహించడమైనదని విచ్చేసిన ప్రజలు రహదారి ప్యాచ్ వర్క్, పార్కుల నిర్వహణ, వీధి దీపాలు, దోమల, కుక్కల బెడద, స్పీడ్ బ్రేకర్లు, చెట్ల కట్టింగ్ ల పై చర్చనంతరం 9వ తెలంగాణ ఈతల పోటీలలో 100 మీటర్ల పోటీలో స్వర్ణ మెడల్, 400 మరియు 200 మీటర్ల పోటీలలో వెండి మెడల్లు, 100 మీటర్ల పోటీలో కాంస్య మెడల్ సాధించిన స్థానిక నివాసి మొహమ్మద్ యూనస్ ను గౌరవముగా అభినందించి ఇతోచిత సత్కారం చేయడమైనదని ది సిటీజెన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking