రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 26 అక్టోబరు 2024
ది సిటీజెన్స్ కౌన్సిల్ ఆద్వర్యంలో మణికొండ కౌన్సిల్ అంతర్భాగమైన వేంకటేశ్వర కాలనీ మునిసిపల్ పార్క్ నందు ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల ప్రజాభిప్రాయ సేకరణతో పాటు నివారణ చర్యలు తీసుకోవడానికి అవలంభించల్సిన విధి విధానాలపై సంపూర్ణ అవగాహన సదస్సు నిర్వహించడ మైనదని అందులో స్థానిక కౌన్సిలర్ బిట్లు పద్మారావు, కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరిప్ మొహమ్మద్, ఉప కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, కమిటీ సభ్యులు రాంసుబ్బా రెడ్డి, శ్రీధర్, వివిధ కాలనీల నుండి విచ్చేసిన ప్రజలు ప్రత్యేకముగా శ్రీ వేంకటేశ్వర కాలనీ, పయనీర్ ఎస్టేట్, ఈవీవీ కాలనీ, ఫెయిర్‌ఫీల్డ్స్ కాలనీ, స్పెక్ట్రమ్ విల్లాస్, హ్యాపీ హోమ్స్ కాలనీ, గోల్దాన్ వ్యూ కాలనీ, గోల్కొండ హిల్స్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రముఖ మైనారిటీ పెద్దలు, మస్జిద్-ఎ-హలీమా మౌలానా మరియు కమిటీ సభ్యులు పాల్గొని చర్చల్లో భాగంగా వీధి దీపాలు,. దోమల, కుక్కల బెడద, స్పీడ్ బ్రేకర్లు, జంగిల్ కట్టింగ్, రహదారి ప్యాచ్ వర్క్, పార్కుల నిర్వహణ తది తర అవసరాలపై తీవ్రంగా చర్చ జరిగిందని, చర్చించిన విషయాలపై అందరి సహకారంతో వివిధ సర్కారు అధికారులను కలసి ముందుకు వెళ్ళి సమస్యల పరిష్కార దిశగా నివారణ చేయడానికి పునుకొంటామని ది సిటీజెన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తెలియ చేసినారు.
