రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 26 అక్టోబరు 2024
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్.సి.ఎస్.సి) 2006 లో లాభా పేక్షలేని, శాంతి భద్రతతో కూడిన రక్షణ ఆశ్రయ సంస్థగా స్థాపించడమైనదనీ ఇట్టి సంస్థ ద్వారా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధముగా, ముఖ్య కూడలి లలో ట్రాఫిక్ నియంత్రణను కట్టుబడి చేస్తూ ప్రజా సేవలందిస్తూన్న సంస్థ సభ్యులు ట్రాఫిక్ పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, ట్రాఫిక్ వారోత్సవాలలో తోడ్పడుతూ, పాఠశాల ఉపాధ్యాయుల అనుమతులతో పిల్లలకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్లు తీసుకోవడంలో తోడ్పడుతు మున్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజా ప్రయోజన కార్యక్రమ నిర్వహణ సేవలో భాగంగా ట్రాఫిక్ సేఫ్టీ రోడ్డు మేనేజ్మెంట్ చర్యల్లో ముందుంటున్న సంస్థ ట్రాఫిక్ వాలంటీర్లను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 160 మందినీ ఎంపిక చేసి వారిని సాదరంగా సగౌరవుముగా ట్రాఫిక్ విభాగపు జాయింట్ కమిషనర్ జోయల్ డెవిస్, ట్రాఫిక్ ఫోరం ప్రధాన కార్యదర్శి రమేష్ ఖాజా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, స్థానిక ఇన్చార్జి కేశవ్, నవీద్ ఖాన్, బాలరాజు, డాక్టర్ చిన్నాలు కలసి చిరు బహుమతులను అంద జేయడంతో పాటు సన్మానించడ మైనదనీ అందరితో పాటు ఫోరం సభ్యులుగా, సేవా దృక్పథంతో వీ ఆర్ 4 సహయోగ చారిటబుల్ ట్రస్టును కొనసాగిస్తున్న అందె లక్ష్మణ్ రావు, దిలీప్ కక్కడ్ తది తరులకు కూడా అభినందన పత్రాలు అందజేయడ మైనదనీ ట్రాఫిక్ ఫోరం సొసైటీలో కీలక వ్యక్తి జాయింట్ సెక్రటరీ సీ.ఆర్ శ్రీనివాస్ తెలియ పరచినారు.
