ప్రజాబలం ప్రతినిధి నారాయణఖేడ్ ఫిబ్రవరి 07 నారాయణఖేడ్ పట్టణంలో రోడ్లపై వాహనాలు ఇష్ట రాజ్యాంగ నిలుపుతే జరిమానాలు విధిస్తామని ఎస్సై ఆర్ శ్రీశైలం చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణంలోని కరస్ గుత్తి రోడ్ రాయపల్లి రోడ్ రాజీవ్ చౌక్ బసవేశ్వర్ చౌక్ రేఖల్ రోడ్ మంగళ పేట్ కూరగాయల మార్కెట్ రోడ్లలో వాహనదారులు రోడ్లపై నిలిపితే జరిమాణాలు విధించడం జరుగుతుందని వాహనదారులు రోడ్లపై వాహనాలను నిల్పకూడదని వ్యాపారస్తులు కూడా తమ దుకాణాల వద్ద రోడ్లపై వాహనాలు నిలిపి ఇతర వాహనాదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసు వారికి ట్రాఫిక్ విషయంలో సహకరించాలని తెలిపారు
