రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి -7
(ప్రజాబలం ప్రతినిధి) గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలో వైరస్ వ్యాదిన పడి బ్రాయలర్ మరియు లేయర్ కోళ్ళు మరణించడం జరిగింది. దీనిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయములో,రాజన్న సిరసిల్ల జిల్లా పౌల్ట్రీ రైతులకు అవగాహన కార్యక్రమం డా.వి.రవీందర్ రెడ్డి,జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఏర్పాటు చేయడం జరిగింది.గత రెండు రోజులుగా జిల్లాలోని పశు వైద్యులు జిల్లలో ఉన్న 97 బ్రాయలర్ ఫార్మ్స్ ,28 లేయర్ ఫార్మ్స్ ను విసిట్ చేయడం జరిగింది.జిల్లాలో వైరస్ వ్యాదినపడి ఎలాంటి మరణాలు సంభవించలేదు.
పౌల్ట్రీ రైతులు షెడ్లను తరుచు సానిటైజ్ చేసుకోవాలి,దాణా సరఫరా చేసే వాహనాలను,కోళ్ళు వ్యాన్స్ మరియు కోడిగుడ్డులను తీసుకొని వెళ్ళే వాహనాలను సానిటైజ్ చేసుకున్న తరువాత మాత్రమే షెడ్ లోకి అనుమతించాలి. ప్రతి షెడ్ దగ్గర ఫుట్ బాత్ లను ఏర్పాటు చేసుకోవాలి.
చికెన్ లో 22% ప్రోటీన్ ఉంటుంది, చికెన్ లో ప్రోటీన్ ఈజీ గా జీర్ణం అవుతుంది కోడిగుడ్డు లో 13 గ్రా ప్రోటీన్ ఉంటుంది.ప్రతి మనిషికి రోజుకు బాడీ ని బట్టి 50 kg బాడీ వెయిట్ ఉన్న మనిషికి 50 గ్రా 70 kg బాడీ వెయిట్ ఉన్న మనిషికి 70 గ్రా ప్రోటీన్ అవసరం అవుతుంది. మనకు కావాల్సిన ప్రోటీన్ లో ఎక్కువ భాగం చికెన్, కోడిగుడ్డు వలన వస్తుంది.
మన రాష్ట్రానికి ఇతర స్టేట్స్ నుండి వచ్చే కోళ్ళ వాహనాలను చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసిన తరువాతనే మన స్టేట్ లోకి అనుమతిస్తున్నారు. ప్రజలు వైరస్ గురించి కోళ్ళ మరణాలను గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని చికెన్, కోడిగుడ్డులను సేఫ్ గా తినవచ్చునని సూచించడమైనది.