– వేదవ్యాస పీఠాధీశులు అనిల్ కుమార్ శాస్త్రి గురూజీ
ప్రపంచంలో మానవ జీవితం ఉత్కృష్ట మైనదని, మోక్ష మార్గానికి నైమిషారణ్య పరిక్రమణ అద్భుతం అని నైమిషారణ్యం వేదవ్యాస పీఠాధీశులు అనిల్ కుమార్ శాస్త్రి గురూజీ అభిభాషణం చేశారు. దధీచి నైమిషారణ్య పరిక్రమణ మహోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆయన శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు.
మార్చి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నైమిషారణ్య పరిక్రమణ జరుగుతుందని లక్షలాది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మోక్ష పుణ్య ప్రాప్తి పొందాలని అనిల్ కుమార్ శాస్త్రి గురూజీ పిలుపునిచ్చారు. సత్య యుగంలో ప్రజా శ్రేయస్సు లోక కళ్యాణం కోసం తన శరీరాన్ని దానం చేసిన దధీచి మహర్షి 88 వేల మంది ఋషులకు, 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేశారని, అదే సంప్రదాయంగా పుణ్య ప్రాప్తి కోసం 84 కోసుల అతి ప్రాచీన పరిక్రమణ కొనసాగుతున్నదని ఆయన వివరించారు. ఈ పరిక్రమణ కార్యక్రమంలో ఋషులు, సాధువులు, గురువులు కూడా భక్తులతో కలసి పాల్గొంటారని, మనసుతో పాటు సంపద ఆరోగ్యం వృద్ధికి దోహదపడుతుందనేది భక్తుల నమ్మకం అని అనిల్ కుమార్ శాస్త్రి గురూజీ తెలిపారు. పరిక్రమణ మహోత్సవం ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వసతి గుడారాలకు చేరుకుంటారని చెప్పారు. భక్తులకు బోలెరో వాహనాలు ఏర్పాటు చేస్తారు. వసతి భోజన సౌకర్యం తో పాటు సాయంత్రం నుంచి కీర్తనలు, భజనలు, ప్రవచనాలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ దీక్షిత్ తెలిపారు. ఈ సమావేశంలో కర్ణాటక మాణికేశ్వరి మాతాజీ శిష్యులు వీర ధర్మేంద్ర స్వామి, వేదవ్యాస పీఠం అధికార ప్రతినిధి కృష్ణవేణి శఠకోపన్ పాల్గొన్నారు. పరిక్రమణ అన్నదానం ఇతరత్రా వ్యయం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. పరిక్రమణలో పాల్గొనే ఆసక్తిగల భక్తులు వారు
9919922869, 9936285629 ఫోన్ నంబరులో సమాచారం ఇస్తే తగిన వసతి భోజన ఏర్పాట్లు చేస్తారని వీర ధర్మేంద్ర స్వామి తెలిపారు.
ఫోటో : దధీచి పరిక్రమణ మహోత్సవం బ్రోచర్ ఆవిష్కరిస్తున్న వీర ధర్మేంద్ర స్వామి, అనిల్ కుమార్ శాస్త్రి గురూజీ, రంజిత్ కుమార్ దీక్షిత్, కృష్ణవేణి శఠకోపన్