డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపి కి చారిత్రాత్మక విజయం.

 

బిజెపి శ్రేణుల విజయోత్సవ సంబరాలు.

గజ్వేల్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-

మెదక్ జిల్ల తూప్రాన్ లో బిజెపి విజయొచ్చావ వేడుకలు భారీ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిన బిజెపి శ్రేణులు
భారతీయ జనతా పార్టీ డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 27 ఏళ్ల తర్వాత విజయభేరి మోగించి చారిత్రాత్మక ఘన విజయాన్ని అందించి కాషాయ జండా ఎగరవేసిందని బిజెపి పట్టణ అధ్యక్షులు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ అన్నారు. శనివారం తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డు పై భారీ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998 లో సుష్మా స్వరాజ్ డిల్లీ సిఎం గా పనిచేసి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఘనత ఆమె కే దక్కుతుందన్నారు. ఆప్ పార్టీ సిఎం, ఉప ముఖ్యమంత్రి, మొత్తం డిల్లీ నీ భ్రష్టు పట్టించిన అవినీతి కి పాల్పడి, ప్రజల తిరస్కారానికి గురై ఓటమి పాలైనారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భూమన్నగారి జానకిరామ్ గౌడ్, బండారు దుర్గారాజు యాదవ్, రామునిగారి మహేష్ గౌడ్, సిద్ధిరాములు యాదవ్, కే.ఆంజనేయులు గౌడ్, తాటి విఠల్, కే.మధుసూదన్ గౌడ్, ప్రింటింగ్ మధు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking