అక్రమంగా నీటి తరలింపు రైతులు ఆందోళన

80 ఎకరాలకు ఫామ్ హౌస్ కు నీటి తరలింపు

నీటి తరలింపులో కొందరి అధికారులకు ముడుపులు అందుతున్నాయని రైతులు కడుపు మీద కొడుతున్నారు రైతుల ఆవేదన

నీటి తరలింపు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటాము- స్థానిక రైతులు

గజ్వేల్ నియోజకవర్గం ప్రజాబలం ఫిబ్రవరి 08 ప్రతినిధి:-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులోని యావపూర్ ఫామ్ హౌస్ లకు అక్రమంగా నీటి తరలిస్తున్నారని ఆయకట్ట రైతులు ఆందోళన చేపట్టారు రాత్రికి రాత్రి గుట్టుచప్పుడుగా బీటీ రోడ్డును తవ్వి పైప్ లైన్ వేశారని దీనికి అధికారులకు ఫిర్యాదు చేశామని కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీటి తరలింపుకు సహకరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు రైతులు ఉమార్,అనిల్ మామిళ్ళ, ఆంజనేయులు, బండ నాగరాజు యాదవ్ ఈ పనులను ఆపకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేమని రాత్రి రాత్రి తెలవకుండా చేశారని దీనికి పనులు ఆపేస్తామని వాళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking