మత్సకారుదు మృతి

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఇటిక్యాల గోదావరి వద్ద అదే గ్రామానికి చెందిన మేడి లింగయ్య అనే 65 సంవత్సరాల మత్సకారుడు మృతి చెందాడు.మృతుడు చేపలు పట్టి కుటుంబాన్ని పోషించుకుంటాడు.రోజు మాదిరిగా బుధవారం రోజు ఉదయం 5 గంటలకు చేపలు పట్టేందుకు గోదావరికి వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గోదావరి వద్దకు వెళ్లి చూసే సరికి గోదావరి ఒడ్డున చనిపోయి ఉన్నాడు.తన మృతిపై ఎవరికి ఎలాంటి అనుమానం లేదు.ఎలా చనిపోయి ఉంటాడు అని తెలుపగలరని తన భార్య పద్మ పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని లక్షెట్టిపేట ఎస్సై పి సతీష్ తెలుపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking