ఎస్.ఎస్.సి.వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లతో సిద్దం

జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 19 : మంచిర్యాల జిల్లాలోని ఎస్.ఎస్.సి.పరీక్షల నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఎస్.ఎస్.సి.పరీక్షల కొరకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,4 వేల 730 మంది బాలురు,4 వేల 468 మంది బాలికలు, గతంలో అనుత్తీర్ణులైన 221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోసిట్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు మినహా మిగతా పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 21న ఫస్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-1, పార్ట్-2, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న థర్డ్ లాంగ్వేజ్, 26న మాథమెటిక్స్, 28న సైన్స్ పార్ట్-1 ఫిజికల్ సైన్స్, 29న సైన్స్ పార్ట్-2 బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్, 3న ఓ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సాన్ట్ & అరబిక్), ఎస్.ఎస్.సి.ఒకేషనల్ కోర్స్ (థియరీ),4న ఓ.ఎస్. ఎస్సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సాన్లిట్ & అరబిక్) పరీక్షలు ఉంటాయని తెలిపారు.పరీక్షల నిర్వహణలో భాగంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు,పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేత,పరీక్ష సమయానికి అనుకూలంగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు టి.జి.ఎస్.ఆర్.టి.సి.బస్సు సౌకర్యం,నిరంతర విద్యుత్ సరఫరా,ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది నియామకం,అవసరమైన మందులు,ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం,ప్రశ్నా,జవాబు పత్రాల సురక్షిత రవాణా, పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్యం నిర్వహణ ఇతర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోనికి మొబైల్, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరుగదని, విద్యార్థులు హాల్ టిక్కెట్ను bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు 7032463114, 9440688034 లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking