సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలి

 

*అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

*బాయిల్డ్, రా రైస్ మిల్లర్లతో సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి -19 (ప్రజాబలం ప్రతినిధి)

సీఎంఆర్ లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా
పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.ఖరీఫ్, రబీ సీజన్ రైస్ అప్పగింత, బ్యాంక్ గ్యారంటీ అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలోని రైస్ మిల్లర్లు రబీ సీజన్ 2023-24లో దిగుమతి చేసుకున్న ధాన్యం-2,56,343 టన్నులు , మొత్తం బియ్యం 1,74,313 ఇవ్వాల్సి ఉండగా, 1,43,656 టన్నులు ఇచ్చారు.అలాగే ఖరీఫ్ 2024-25 -దిగుమతి చేసుకున్న ధాన్యం-2,11,572 , మొత్తం బియ్యం- 1,42,150 ఇవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా 21,103 ప్రభుత్వానికి అందజేశారు.ఆయా రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు త్వరితగతిన అందజేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.రైస్ మిల్లులకు రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించి, వాటిపై సమీక్షించాలని పేర్కొన్నారు. పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ రైస్ మిల్స్ లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయో గుర్తించాలని,నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. వారు సీఎంఆర్ ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకోవాలని, సరైన ప్రణాళిక రూపొందించి లక్ష్యం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లక్ష్యం పూర్తి చేయడంలో రైస్ మిల్లర్లకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు.సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking