ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 19 : జిల్లాలోని ప్రాజెక్టుల క్రింద సాగు చేయబడే చివరి ఆయకట్టు వరకు పంట సాగుకు నీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో నీటిపారుదల శాఖ ఈ.ఈ.,డి.ఈ.ఈ., ఎ.ఈ.ఈ.లతో సాగునీటి నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 11.4 టి.ఎం.సి. ఉందని, కార్యచరణ ప్రకారం నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.సుందిళ్ళ, అన్నారం,గూడెం ఎత్తిపోతలు,ఇతర మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని, నీల్వాయి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.జూన్ 15వ తేదీ వరకు జిల్లాలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. పంట సాగులో నీటి అవసరం తక్కువగా ఉండే వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, కెనాల్లు,ట్యాంకులు, చెరువుల శుద్దీకరణ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.సిర్సా ఎత్తిపోతల పథకం,అర్జునగుట్ట,కిష్టాపూర్ ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని,ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సాగునీరు, త్రాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా కార్యచరణ అమలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Post