ప్రజాబలం ప్రతినిధి
ములుగు జిల్లా
తేదీ 19-03-2025
మల్లు స్వరాజ్యం గారి తరహాలోని నేను అడవి నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాను
మల్లు స్వరాజ్యం గారి పోరాటాల నుంచి నేను స్ఫూర్తి పొందాను
ఉన్నత కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాలను త్యాగం చేసి పేదల కోసం గారు పోరాటాలు చేశారు
ములుగు నర్సంపేట వంటి ప్రాంతాల్లో దల కమాండర్ గా మల్లు స్వరాజ్యం గారు పనిచేశారు
మల్లు స్వరాజ్యం గారి జీవితాన్ని చదివి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాను
జనంతో మమేకం అవ్వడం మల్లు స్వరాజ్యం నుంచి నేర్చుకున్నాను
మల్లు స్వరాజ్యం గారి లాగానే నా జీవితం కూడా సాగింది
అడవి నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజకీయ రంగాన్ని నేను ఎంచుకోవడానికి మల్లు స్వరాజ్యమే కారణం
తెలంగాణ అంటేనే పోరాటం, త్యాగం
ఆ పోరాటానికి త్యాగానికి మల్లు స్వరాజ్యం నిలువెత్తు రూపం
తెలంగాణ త్యాగదనుల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుంది
అందుకే మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాను
తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాం
ప్రజా యుద్ధనౌక గద్దర్ ను గుర్తు చేసే విధంగా ఆయన పేరుతో అవార్డులు ఇస్తున్నాం
తెలంగాణ మట్టి మనుషులైన గోరేటి, పాశం యాదగిరి వంటి వారికి సన్మానాలు చేశాము
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణకు విముక్తి కలిగింది
విముక్తి పోరాటంలో కీలక పాత్ర పోషించిన మల్లు స్వరాజ్యం గారు ప్రజలకు గుర్తుండేలా పనిచేస్తాం
మల్లు స్వరాజ్యం గారి ఫస్ట్ ఏర్పాటులో, ఆమె విగ్రహ ఏర్పాట్లు నా వంతు పాత్ర పోషిస్తా
మహిళా సమానత్వం కోసం, పేదరిక నిర్మూలన కోసం మల్లు స్వరాజ్యం గారు చివరి వరకు పోరాటం చేశారు
ఆమె స్ఫూర్తిగా పేదరిక నిర్మూలన కోసం, వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం మనమంతా పనిచేయాలి
