వేములవాడ ,మార్చి -19
(ప్రజాబలం నియోజకవర్గ ప్రతినిధి)
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోడె మొక్కులు తీర్చుకున్నారు, ముందుగా ఆలయ అర్చకులు వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తర్వాత అర్చకులు ఆశీర్వదించగా ఆలయ ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్ లడ్డూ ప్రసాదం అందజేశారు.