ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

– చలివేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ప్రజాబలం ప్రతినిధి
ములుగు జిల్లా
తేదీ 19-03-2025ములుగు జిల్లా కేంద్రములో మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వర్గీయ నల్లెల కుమారస్వామి గారి జ్ఞాపకార్థం ములుగు జిల్లా హాస్పటల్ ముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ గారి ఆధ్వర్యములో చలి వేంద్రం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరై చలి వేంద్రాన్ని ప్రారంభించిన
రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి వర్యులు సీతక్క గారు మాట్లాడుతూ
రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి, వడగాలులు వీస్తున్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ప్రజలు వీలైనంత వరకు పగటి పూట ఇంటి వద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలనిఅత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, చేతి రుమాలు, టవల్ వినియోగించాలని, బయటి పదార్థాలు తినకూడదని, ఎక్కువగా నీళ్లను తాగాలని, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలనుతీసుకోవాలన్నారు ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking