గోషామల్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ శనివారం నాడు గోషా మహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజా సింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. 1000 కోట్ల సవాల్ ను బిఆర్ ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ విసిరారు. గోశామహల్ లోని కోఠి, అబిడ్స్, ఎంజె మార్కెట్, సిబిఎస్ , జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తా లలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసారు. రాజసింగ్.. 1000 పొర్లు దండాలు పెట్టి.. 1000 కోట్లు పంచినా ఓట్లు వేయరు. రాజా సింగ్ 9 ఏళ్ల లో గోశామహల్ నియోజకవర్గం లో ఏం అభివృద్ధి చేసారో చెప్పాలి. హిందుత్వం, మతం పేరును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూన్నాడని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్ ఇస్తారు. వాటిని సోషల్ విూడియాలో వైరల్ చేస్తూ.. రాజకీయ పబ్బం గడుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గోశామహల్ ప్రజలు రాజసింగ్ ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమస్యల కోసం.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నడూ అందుబాటులో ఉండడని అయన ఆరోపించారు.