ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 11 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో శనివారం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ కె.వి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథుగా డా చీమ శ్రీనివాస్ పాల్గొని తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదసు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు .12-03-2023 ఆదివారం మ1.00 గం ల – సా 6.00 గం వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదసు జరుగుతుందని తెలిపారు కావున తొలిదశ మలిదశ ఉద్యమకారులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు . తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేసి 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 20 శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలి నామినేటేడ్ పదవులలో ఉద్యమకారులకి ప్రాధాన్యత కల్పించాలి , ఉద్యమకారులకి పెన్షన్, ఉచిత బస్సు మరియు ట్రైను పాసులను అలాగే ఆరోగ్య కార్డులను 300 గజాల ఇంటి స్థలాన్ని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని , తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించాలి , అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి , ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యార్థి ఉద్యమకారులకి కోట కేటాయించాలి ఇలాంటి పలు అంశాలపై ఈ సదస్సు ఉంటుందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో కూరపాటి రంగారావు , పాలకుర్తి కృష్ణ , S. నరసయ్య , రైస్ అన్వర్ , మంచికంటి నరేష్ , నెల్లూరి అచ్యుత రావు , కాసాని నాగేశ్వరావు , పగడాల నరేందర్ , అబ్బాస్ , అమరగాని శ్రీను , బుక్య రాంబాబు , బచ్చల పద్మాచారి , మందడపు శంకర్ రావు , అసిఫ్ , బురాన్ , రవిచంద్ర చౌహన్ , దాసరి శీను , నాగుల్ మిరా , బుక్య శ్రీనివాస్ నాయక్ , బెజ్జంకి ప్రభాకర చారి , పెరుగు వెంకటరమణ యాదవ్ పాల్లెపు సోమరాజు , అబ్దుల్ రెహమాన్ ఉపేంద్ర నాయక్ కొమ్ము ప్రసాద్ సలీం వీరన్న నాయక్ రవి గౌడ్ , దోడ్డ శ్రీనివాస్ రెడ్డి మిర్యాల నాగరాజు చెరుకుపల్లి నాగేశ్వరరావు అడపా ప్రవీణ్ కాసిం ఖాన్ కొట్టే సుధాకర్ గోపే నాగేశ్వరావు లాలయ్య రవీందర్ వీరాస్వామి శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ గా మసూద్ ఎన్నికయ్యారు .