రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ గారిపై అనుచితంగా అహంకారంగా మాట్లాడిన దేశ ద్రోహి హమారా ప్రసాద్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.

 

కాశపాగా ఇమ్మయ్య జిల్లా SC ST అట్రాసిటీ &మనిటరింగ్ కమిటీ సభ్యులు సంగారెడ్డి జిల్లా డిమాండ్

సంగారెడ్డి ఫిబ్రవరి: 11 ప్రజాబలం ప్రతినిధి: సోషల్ మీడియా వేదికగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై చంపుతానంటూ అనుచితంగా మాట్లాడిన మనువాద మతోన్మాది హమారా ప్రసాద్ పై ఎస్ సి , ఎస్ టి అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అయన డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గమైన కులదురహంకార దారుణమైన వ్యాఖ్యలు మరొకరు ఇలా మాట్లాడకుండా కఠినంగా శిక్షించాలని అయన డిమాండ్ చేశారు .
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపికి చెందిన మనువాద మతోన్మాది హమారా ప్రసాద్ నిరంతరం తాను చేస్తున్న చిల్లర పనులకు తోడుగా వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత పైనే ఖండ కావరమెక్కి మాట్లాడటం దేశ ప్రతిష్టకే అవమానకరమని, హమారా ప్రసాద్ ను అరెస్ట్ చేయడమే కాదు కఠినంగా శింక్షించాలన్నారు. ప్రజల మధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతూ వాటికి దేశ నాయకులను ఉపయోగించుకునే ఇలాంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించాలన్నారు.
బాబాసాహెబ్ ను చంపుతానని మొరగడమే కాక, గాంధీని చంపిన గాడ్సే వారసుడిగా ప్రకటించుకోవడం తన మత ఉన్మాదాన్ని తెలియజేస్తోందన్నారు. అంబేద్కర్ బ్రతికి ఉంటే గాంధీని గాడ్సే కాల్చినట్లే నేను కూడా అంబేద్కర్ ని కాల్చి చంపేవాడినని బహిరంగంగా ప్రకటించడాన్ని ఉపేక్షించరాదన్నారు. ఇది జాతికి జరిగిన అవమాణంగా పరిగనించి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు.
జాతీయ నాయకులను కించపరిచే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని డిమాండ్ చేశారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking