పత్తి పంటకు సరైన ధర లేక రైతు ఆత్మహత్య ప్రయత్నం ధైర్యం చెప్పిన బిఎస్పీ నాయకులు ముప్పారం ప్రకాశం

సంగారెడ్డి ఫిబ్రవరి 11 ప్రజ బలం ప్రతినిది:11
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం నియోజకవర్గం మునిపల్లి మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన కలాలి సత్తయ్య గౌడ్ పది ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగుతో వచ్చిన చిన్న రాబడి పెట్టుబడి కి సరిపోని కారణంగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర చేసిన అప్పు తీర్చలేక ఆత్మవిశ్వాసం కొరబడి ఇంకా సాగు తీసుకొచ్చిన పత్తి మందులు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు. సరైన సమయంలో కుటుంబీకులు స్పందించి సంగారెడ్డి ప్రభుత్వ దావఖానాలో చేర్పించడం వల్ల ఇట్టి విషయాన్ని తెలుసుకున్న “బహుజన్ సమాజ్ పార్టీ” (బిఎస్పి) నాయకులు ముప్పారం ప్రకాశం వెంటనే స్పందించి అక్కడి ప్రభుత్వ దావకాన డాక్టర్లను పురమాయించి సరైన వైద్యం అందే విధంగా చూసి నేడు ఆ సత్య గౌడ్ డిచార్జ్ అవగా సత్య గౌడు సొంత గ్రామానికి ముప్పారం ప్రకాష్ దగ్గరుండి తన వాహనంలో ఇంటి వరకు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటివారికి అప్పజెప్పి ధైర్యం చెప్పారు. దేశానికి వెన్నెముకైనా రైతు సరైన గిట్టుబాటు ధర లేక ప్రభుత్వ సహకారము అధికారుల సహకారం లేక ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదని రైతుల పక్షాన బిఎస్పి అండగా ఉంటదని భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన బిఎస్పి పార్టీ దృష్టికి తీసుకొస్తే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. డాక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో భవిష్యత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ ప్రభుత్వంలో పేదలకు ఎలాంటి కష్టాలు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా ముప్పారం ప్రకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు ప్రకాష్, ప్రవీణ్, వీరన్న, మొగులన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking