దిగ్విజయంగా తొలి వసంతం పూర్తిచేసుకున్న కావ్య ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
డాక్టర్ కావ్య చంద్ యాలమూడి (ఎండోజైనాలజీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు)
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 11 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో కావ్య చంద్ యాలమూడి ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు గాను సరిగ్గా ఏడాది కిందట 2023 ఫిబ్రవరి 12న ఖమ్మం గుమ్మంలో పులిపాటి ప్రసాద్ కాంప్లెక్స్ ఓవర్ బ్రిడ్జి పక్కడ ప్రారంభించిన కావ్య హాస్పి టల్స్ అనతి కాలంలోనే అరుదైన వైద్యసేవలు అందించి జిల్లా ప్రజలకు చేరువైంది. షుగర్, బీపీ, థైరాయిడ్ చికిత్సలో ఆధునిక వైద్యం అందిస్తూ మొదటి సంవత్సరంలో ఒక్క డెత్ కేసు కూడా లేకుండా డా. కావ్యచంద్ యాలమూడి తన ప్రస్థానాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నారు.
తొలి ఏడాదిలో అద్భుతమైన వైద్య సేవలు అందించిన డాక్టర్ మాట్లాడుతూ
మధుమేహం (షుగర్, వయా బ్రిటీష్) అనేది మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమైంది. కాలు పాదం మొదలుకుని కండ్ల వరకూ అన్ని అవయవాలను చాప కింద నీరులా కబలించే రుగ్మత అందుకే ఇలాంటి వ్యాధి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అన్నారు. హాస్పిటల్ ను ప్రారంభించి తొలి ఏడాదిలో ఆదరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. మొదటి సంవత్సరంలో మీరిచ్చిన ప్రోత్సాహలతో మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు రాబోవు రోజుల్లో మరింతగా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు