కేజీబీవీ విద్యాలయంలో స్వపరిపాల దినోత్సవం

చౌటుప్పల్ ఫిబ్రవరి 11 : కేజీబీవీ విద్యాలయం నారాయణపురంలో ఈరోజు విద్యార్థుల స్వపరిపాల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రిగా ఆర్. వైశాలి పదవ తరగతి, కలెక్టర్ గా ఈ. సుష్మిత పదవ తరగతి, డి ఈ ఓ గా వి. త్రిష పదవ తరగతి, ఎస్ఓ గా నందిని పదో తరగతి, పలువురు విద్యార్థులు, విద్యార్దినులు ఉపాధ్యాయులుగా బోధించారు. విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పిఎస్ వీజీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పాలకూర మురళి విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు జి వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులకు క్రమశిక్షణ సమయపాలన చదువుపై శ్రద్ధ, సంస్కారం, చదువు, అను అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రచా అధ్యక్షులుగా పాఠశాల ఎస్ఓ శివరంజని మరియు అధ్యాపకులు కరుణ, కవిత, ఉమా, స్వప్న, అనిత, సహాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking